శ్రీ రామసేవాకుటీరము

“ఆంధ్రవాల్మీకి” వాసుదాసు స్వామి

మందరము

           అత్యంత శ్రీరామ భక్తుడైన పోతన మాత్యుడు “చెనకి చెఱిచినాడు భాస్కరుడు. లేకుండిన రామాయణము బండికెక్కింపనా” యనె లోకోక్తి కలదు. ఆయన సంకల్పము నేటికి సఫలమైనది .  ఆయనకు బ్రాణపదమైన శ్రీ రామాయణము మహాత్మ్యమంతయు దెలుప నిదిసమయముగాదు గాని యా విషయమున రెండు మూడు శ్లోకము లనువాదించెదను.

“వేదం వేద్యే పరేపుంసి, జాతే దాశర థాత్మజే

వేదః ప్రాచేతసా దాసీత్, సక్షద్రామాయణాత్మన”

       ఆమ్నాయవేద్యోహరి యన్నట్లు వేదములచే దెలసి కొన బడు నా పరమ పురుషుడు దశరథ కుమారుడై జనించినపుడు ఆయన మహాత్మ్యము వెల్లడించి లోకుల గృతార్ధుల జేయ సాక్షాద్వేదమే వాల్మీకి మహర్షి కృత రామాయణమయ్యెను. ఇట్టి శ్రీ మద్రామాయణ మునకు శ్రీమన్నారాయణుని యపరావతారమైన వ్యాస మహర్షి వ్యాఖ్యన రూపముగ ధర్మ శాస్త్రమును బోధించు శ్రీ మహాభారతమును వేదాంతార్థమును బోధించు శ్రీ భాగవతము వ్రాయుచు మహాభారతమందు.   

“వేదేరామాయణే చైవ, పురాణే భారతే తథా

         ఆ దావంతే చమధ్యేచ, విష్ణుస్సర్వత్ర గీయతే”         

యని వ్రాసెను.

       వేదమందు రామాయణమందు పురాణమందు భారతమందు మొదట నడుమ దుద నెందు జూచినను విష్ణువు కీర్తింపబడుచున్నాడు. బెల్లపు గడ్డయం దేభాగము దీసి నోరవేసికొనినను మధురరసము తెలియనగును. అట్టులే రామాయణమందు విష్ణువే సర్వత్ర కీర్తింపబడినను ఒక్కొక్క కాండ మందు నొక్కొక్క ఘట్టమునందు నొక్కొక్క సమయమున నన్నిరసములు తెలియనగును. కావున వెగటు పుట్టింపదు. మనోరంజన పుష్పమువలె నొక్కొక్కసారి యొక్కక క్రొత్త విశేషము స్ఫురింప జేయును. ఇంత మాత్రమే కాదు. సమస్తాధి వ్యాధి బాధలకు రామాయణము దివ్య రసాయనమని యీ శ్లోకము దెలియనగు.

అశేష మేకేనైవాహ్నశ్రు త్వారామాయణం తన

శాపస్య శాంతిర్భవతీత్యూచి రేతే ప్రసాదితాః ||

          తమ కాతిధ్యమీయని దామోదరుడను రాజును ఋషులు శపించిరి. ఆయన ప్రార్థింపగా రామాయణ మంతయు నొక నెట్టున వినుటచే శాపమును హరింపగలది మఱిదేనిని హరింప జాలకుండును?

       సూర్యాది దశానాథులును అంతర్దశానాథులును దుష్టములై బాధించునపుడు వానివాని శాంతికై విధింపబడిన యాయా సర్గములను ఆయా శ్లోకములను బఠించిన నాదోషము నివారణ మగును. దుష్టశక్తి ప్రయోగములను జెరుచుటకై కొన్ని శ్లోకములు విధింపబడెను. సకాము లెట్లు ఎప్పు డేయేకామమునకు నేయేభాగము పఠింప వలయును ముముక్షువు లెప్పు డెట్లు పఠంపవలయును అను నియమములు గలవు. ఇవిగాక మహామంత్రములును గలవు వీని లక్షణమెరుగక గ్రుడ్డియెద్దు చేలోబడినట్లు పారాయణము చేసిన నేమి మేలు?

          ఇవిగాక కావ్యార్థ విశేషములు ధ్వన్యర్థములు విశేషార్థములు శాస్త్రవిచారములు పెక్కులు గలవు. ఇట్టియద్భుత మహిమగలిగి సర్వవిషయముల నన్నివిధముల బ్రథమంబని పేరెన్నికగన్న యీ యుత్తమోత్తమ లోకోత్తర గ్రంథము సంస్కృతమున నుండిన కారణమున నాభాష రానివారి కది యందనిపండై యుండెను. ఆకారణమున దాని మహిమయు బూర్ణముగ నాంధ్రలోక మెరుగదు. దానియందలి మీదజెప్పబడిన విశేషగుణము లేవియు లోపింపక మూలమునకు సరిగా నున్నదని పండితులచే విఖ్యాతిగన్న ఆంధ్రవాల్మీకి రామాయణము బ్ర || శ్రీ || రా || శ్రీ || వావిలికొలను సుబ్బారావు గారు రచించిన యాకొఱత దీర్చిరి. కాని ఎందెం దేయేని శేషములున్నవో తెలిసికొను మార్గము మాత్ర మాంధ్రుల కింతవరకు దెలియకుండేను. కావున వారే యాకొఱతయు దీర్పగోరి మందర మనుపేర నిపుల వ్యాఖ్యానము రచించి యాయా యర్థముల నెల్ల వెల్లడించిరి.

        ఒక్క గంతున సముద్రమున లంఘించిన క్రోతుల కాసముద్రములో నుండు నమూల్య పదార్థముల నెట్లేరుగ శక్యమగును ? మందరముగదా దానిని మధించి శొధించియందు మునిగి వెలికివచ్చి దానియందిలి చింతామణి కామధేను కల్పవృక్ష లక్ష్మీసుధా ఘటంబులను వెలుపల దీసి సాధు బృందారక బృందమునకు లభింపజేసి వారి నమృతుల జేసెను. అట్టులే యీ మందరము ఆంధ్రవాల్మీకి రామాయణ మహార్ణవము మధించి దాని యందిలి యమూల్యార్థము లన్నియు మీద జెప్పిన విశేషములతోడ దేట తెల్లముగ దానిని సేవించిన సర్వజనులకు దెలియునట్లు విశదపరిచెను. ఇట్టి రామాయణగ్రంధ మేదేశమున నేభాషయందును లేదని ప్రసిద్ధికెక్కినది. యీ వ్యాఖ్యానము నట్టి ప్రసిద్ధియే కాంచగలదు.

          ఈ మందరమందు మూల పద్యము ప్రతి పదార్థము తాత్పర్యము, విశేషార్థము, ధ్వన్యర్థము, శాస్త్ర చర్చలు ఛందో వ్యాకరణాలంకరా విశేషములు, మంత్రార్థము, భక్తులకు బ్రపన్నులకు గావలసిన సర్వ విషయములు విశదముగా విపులముగా వ్రాయబడెను. రామాయణవిషయమున గొందరకు గల సందేహములు బరిహారములు వ్రాయ బడినవి రామాయణవిషయమున గొందరకు గల సందేహములకు బరిహారములు వ్రాయబడినవి రామాయణకాలము నాటి మనదేశవిభాగము () వ్రాయబడినది. సీతారామ లక్ష్మణుల సంచార మార్గములు తెలుపు పటములు శ్రీరాముని దినచర్యయు నిందుగలవు.

     రామాయణమందలి ముఖ్యస్త్రీపురుష గుణవర్ణములు నిందుగలవు సంస్కృత వ్యాఖ్యానము కంటె నిందనేక విషయములు నేటికివారేరుంగ దగినవి వ్రాయబడినవి. శైలిసర్వ జనీనము. గ్రంధకర్తయే వ్యాఖ్యతయు నగుటచే పెట్టినవానికి దెలియు నిక్షేపమన్నట్టు లన్ని విషయములు యథార్థరీతి వెలికి రాగలిగెను. అమృతాన్నము సిద్ధమైనది అదృష్టవంతులు భుజింతురు. ఇంత లోకోపకారమైన యింత హితబోధకమై యింత యిహపరసాధకమై యింత సర్వజన సేవ్యమైన సర్వజనీయమైన యింత గొప్ప గ్రంథమిదితప్ప నింతవరకు నాంద్రంబున వేరొండులేదని గ్రంధమున బఠించిన వారు చెప్పుచున్నారు. ఇంత గొప్ప గ్రంధ మొక్కసారిగా ముద్రింప నసాధ్యము కావున భాగములుగ ముద్రింపబడుచున్నవి. ఎంతటిపండితుడైనను దీనిని జదువనివాడు రామాయణార్థము పూర్ణముగా జెప్పజాలడని యనేకులు యభిప్రాయము.    

మందరముపూర్తి

       శ్రీ సీతారామచంద్రమూర్తుల కరుణాకటాక్ష వీక్షణమువలన నేటికి నుత్తరకాండ వ్యాఖ్యానము కూడ నెరవేరినది. ఇది కేవల శ్రీ రామచంద్రమూర్తి కటాక్షముననైన కార్యమోకాని వాసుదాసుని పురుషకారముచేనైన కార్యము కాదు. ఇది యనుభవముచే సిద్ధాంతితము. బాలకాండ వ్యాఖ్యా యొంటిమిట్ట వల్మికాశ్రమమున రచింపబడి స్వామి కర్పించిన సాయంకాలమే వాసుదాసుడు భయపడుచుండినట్లు హాలాహలము జనించెను. అది యిప్పటికి బూర్ణముగా జల్లారుటయేకాక గ్రంధము సాంతమైనది. అమృతము సిద్ధమై వెలువడినది – విబుధులు భోక్తులు సిద్ధపడియున్నారు. వడ్డించుటకు మోహినీ దేవత రావలసియున్నది. అయోధ్యాకాండ వ్యాఖ్య మేలుపట్టునందు మ-రా-శ్రీ, సి. దొరస్వామినాయుడుగారి మందిరమున వ్రాయబడెను. అరణ్యకాండము నడిగడ్డపాళేము నాశ్రమమం దేట్లెట్లో నెరవేరెను. ఆవల నొకసంవత్సర మీ కార్యము జరిగినదికాదు. వాసుదాసుడు భగవత్కటాక్షము లేదేము ఈ కార్యము నెరవేర్చుభాగ్యము తనకు లేదేమో యని విచారపడుచుండు సమయమున కోలంక వీరవరము జమీందారుగారగు మ-రా-శ్రీ, రాజరావు రామాయమ్మగారు బహదరువారు వాసుదాసుని బిలిపించి ముందరకార్యము మా గ్రామమున నుండి పూర్తిచేయవలసినదని సెలవిచ్చిరి.

       ఆ ప్రాకరమే గడచిన ఆషాడమాసమున నిచ్చటికి వచ్చి యాకార్యమునందే మనస్సుంచి వ్రాయగా భగవత్కటాక్షమున నది నేటికి నెరవేరెను. రాజాఅమ్మగారి కీసంకల్పము భాగావత్ప్రేరితము. ఇచ్చట నుండుటవలన నీకార్యము నెరవేరినది కాని మరియొక చోట నిది నెరవేరియుండదు. రాజా అమ్మగారు తొమ్మిదినెలలు తల్లి తన గర్భమునందలి శిశువును రక్షించునట్లు రక్షించిరి. పండ్రెండు సంవసత్సరములుగ నింత విశ్రాంతి నింతనిర్విచారముగా వాసుదాసుడొక చోట నుండినదిలేదు. ఇంత సహాయము చేసిన శ్రీరాజారావు రామాయమ్మరావు బహదర్ వారికి నితోధిక శ్రేయస్సు, నిశ్రేయము కలిగించునుగాక !

       భగవానేవ స్వయంమేవ కారయతే యన్నట్లు భగవంతుడు తనకార్యము చేయించుకొన్నాడు వాసుదాసుడు జన్మించిన కార్యము దీనితో ముగిసినదనియే తోచుచున్నది. అయినను మరియొక యరుమాసము లొక్క చో మరల గూర్చుండిన గాని యుత్తరపీఠిక ముగియదు. అది నెరవేరినను నెరవేరకున్నను వ్యసనము లేదు. ఇది ముగియగానే వాసుదాసుడు షేక్సిఫీయర్ మంత్రదండము () ను పారజేసినట్టు తన కలమును బారవేసి తపమున గాలక్షేపము చేయదలచి యువ్విళ్ళు యురుచుండేను గాని భగవత్సంకల్పము దాని కనుకూలపడనట్లు లేదు.

అన్యథాశరణంనాస్తి, త్వమేవ శరణంమమ

తస్మా త్కారుణ్య భావేన రక్షరక్షో జనార్దన.

       ఆంధ్ర వాల్మీకి రామాయణము మందరము – తీకాతాత్పర్య వ్యాఖ్యానములతో 

11

                                                                               017 copy   బాలకాండము 1           బాలకాండము  2

బాలకాండము  3           బాలకాండము  4

 010                                          011

           అయోధ్యకాండము 1                                                                                                                                అయోధ్యకాండము 1

          అయోధ్యకాండము 2                                                                                                                               అయోధ్యకాండము 2

          అయోధ్యకాండము 3                                                                                                                               అయోధ్యకాండము 3

                                                               

013                                                             012                               అరణ్యకాండము  1                                                                                              కిష్కింధకాండము  1  

                       అరణ్యకాండము 2                                                                                               కిష్కింధకాండము 2

                       అరణ్యకాండము 3                                                                                                                                                 

                                                                                                                                       

                                                                                                                    

                                                                                                                                                                     

014

సుందరకాండము  1

సుందరకాండము 2

సుందరకాండము 3

   015                                                           016                     యుద్ధకాండము  1                                                                                                                 యుద్ధకాండము  1

                  యుద్ధకాండము 2                                                                                                                  యుద్ధకాండము 2

                  యుద్ధకాండము 3                                                                                                                  యుద్ధకాండము 3

 

017

ఉత్తరకాండము 1

ఉత్తరకాండము 2

ఉత్తరకాండము 3